కులగణన ఉంటుంది: కేంద్రం | union home ministry confirms census continues | Sakshi
Sakshi News home page

కులగణన ఉంటుంది: కేంద్రం

Jun 17 2025 5:42 AM | Updated on Jun 17 2025 5:42 AM

union home ministry confirms census continues

న్యూఢిల్లీ: జనగణనలో భాగంగా ఈసారి కులగణన కచ్చితంగా ఉంటుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ‘సోమవారం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో కులగణన ప్రస్తావన లేదని, ఆ కసరత్తు ఉండబోదని తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోంది. దాన్ని నమ్మొద్దు‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

 గెజిట్‌ లో కులగణన ప్రస్తావనే లేదని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. ఇది మోదీ సర్కారు యూ టర్న్‌ అని విమర్శలు గుప్పించింది. అనంతరం కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. కేవలం కులగణనకే పరిమితం కారాదని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ‘ఈ విషయంలో తెలంగాణ మోడల్‌ ను అనుసరించాలి. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమగ్ర వివరాలను కూడా కులాలవారీగా పొందుపరచాలి‘ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement