మావోయిస్టులకు అమిత్‌ షా సవాల్‌ | Union Home Minister Amit Shah Visit To Dantewada District | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు అమిత్‌ షా సవాల్‌

Apr 5 2025 3:29 PM | Updated on Apr 5 2025 4:16 PM

Union Home Minister Amit Shah Visit To Dantewada District

ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాండుం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్‌ షా అన్నారు.

ఇదే వేదికపై నుంచి మావోయిస్టులకు ఆయన గట్టి సవాలు విసిరారు. బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.

మోదీ నుంచి తానొక సందేశం తెచ్చా.. వచ్చే ఏడాది దేశంలోని ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తాం’’ అని అమిత్‌ షా ప్రకటించారు. బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి రాయబారులను బస్తర్‌కు తీసుకువస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement