TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్య | Unidentified People Killed Aia Dmk Worker In Tamilnadu | Sakshi
Sakshi News home page

TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్య

Jul 28 2024 2:48 PM | Updated on Jul 28 2024 3:30 PM

Unidentified People Killed Aia Dmk Worker In Tamilnadu

చెన్నై: తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో ఆదివారం(జులై 28) అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తిరుపాప్లియూర్‌కు చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. ఇతడు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 

బాగూర్‌​ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా పద్మనాభన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టారు. దీంతో పద్మనాభన్‌ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పద్మనాభన్‌పై గతంలో హత్యకేసు ఉండటం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement