breaking news
	
		
	
  Cuddalore
- 
      
                   
                                                       కన్నీళ్లే..ఆయుధాలైకడలిలో తమిళ తంబీల ఆగడాలు ఇక చెల్లవంటున్నారు జిల్లా మత్స్యకారులు. నడిసంద్రంలో సమరానికి సై అంటున్నారు. మా ప్రాంతంలోకి వచ్చి మత్స్య సంపదను దోచుకుపోవడమే కాకుండా రూ.లక్షలు విలువజేసే వలలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. ఇటువైపు కన్నెత్తి చూస్తే ఎదురుదాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల మత్స్యకారులు సమావేశమై సోనాబోట్ల అంతుచూడాలని నిర్ణయించుకున్నారు. చేపల వేటతో పాటు నిబంధనలు ధిక్కరించే తమిళ జాలర్లను కూడా వేటాడేస్తామంటూ కదనరంగంలోకి దిగారు. ఇప్పటికే రెండు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు.ఒంగోలు, టాస్‌్కఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లా తడ వరకూ సుమారు 281 కిలోమీటర్లు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ప్రాణాలు పణంగా పెట్టి చిన్న బోట్లతో వేట సాగిస్తున్నారు. మత్స్య సంపదను తెచ్చుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వీరిపై మెకనైజ్డ్ (సోనా) బోట్లతో తమిళ జాలర్లు సమూహంలా వచ్చి మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. రూ.లక్షల విలువైన వలలను ధ్వంసం చేస్తున్నారు. మత్స్య సంపదను దోచుకెళ్లిపోతున్నారు. తమిళనాడుకు చెందిన కడలూరు జాలర్లతో మన మత్స్యకారుల సమరం నిత్యకృత్యంగా మారింది. చేపల కోసం వేట చేయడం ఒక ఎత్తైతే, సముద్రంలో తమిళ జాలర్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా మారింది. చిన్న ఇంజిన్ ఉన్న బోట్లతో సముద్రంలో తీరం నుంచి 8 కి.మీ. లోపలే వేట సాగించుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్లి వేట సాగించుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు ఒడ్డు నుంచి 23 కి.మీ. అవతలి జలాల్లో మాత్రమే చేపల వేట చేసుకోవాల్సి ఉంటుంది. ఒడ్డు నుంచి సముద్రంలో 8 కి.మీ. వరకు మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. తమిళనాడులో వేల సంఖ్యలో ఈ రకం బోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 5 నుంచి 10 మంది వరకు మత్స్యకారులు ఉంటారు. అధునాతన వలలు, మారణాయుధాలతో మన ప్రాంతం వైపు వచ్చి దాడులు చేస్తున్నారు. వీరి నుంచి రక్షించాలని అధికారులను, పాలకులను కోరుతూ వస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు..స్వీయ వేట నిషేధం..మత్స్యకారులు ఎన్నోసార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు మత్స్యకారులు తమ సమస్యను తామే పరిష్కరించుకోవటానికి నడుం బిగించారు. చిన్నబోటుతో చేపల వేటకు వెళితే సముద్రంలో 60 నుంచి 80 వరకు సోనాబోట్లు చేపల వేట సాగిస్తూ మత్స్య సంపద కొల్లగొట్టడంతో పాటు లక్షలాది రూపాయల వలలు ధ్వంసం చేసేవని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాబోట్ల కట్టడికి మన జిల్లాతోపాటు, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకార కాపులు ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు.మూడు రోజుల పాటు వేట నిషేధం అని ప్రకటించారు. 12వ తేదీ రాత్రి గతంలో తాము వేటాడి నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచిన కడలూరుకు చెందిన సోనాబోటును తీసుకుని సుమారు 80 మంది జాలర్లు కర్రలు, కేట్బాల్స్, టపాసులు తీసుకుని తీరంలో సోనాబోట్ల వేట ప్రారంభించారు. ఆంధ్రా మత్స్యకారులు తమపై దాడికి వస్తున్నారని సమాచారం రావటంతో జాగ్రత్త పడ్డ కడలూరు జాలర్లు పారిపోయారు.నిషేధకాలం పూర్తయిన తరువాత నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేట కొనసాగించగా ఈనెల 18వ తేదీ గురువారం రాత్రి సోనాబోట్లు తీరానికి దగ్గరగా వచ్చి లక్షలాది రూపాయలు వలలు తెంచుకుని చేపల వేట సాగించారు. ఈసారి కడలూరు బోట్లను వదిలేది లేదని నిశ్చయించుకున్నారు. తిరిగి 19వ తేదీ చేపల వేట నిషేధం అని మత్స్యకార గ్రామాల్లో రెండవసారి దండోరా వేయించారు.ఏడాదిన్నరగా నిరీక్షణ..కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మత్స్యకారుల సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకుని వెళ్లారని, సీఎం చంద్రబాబు కూడా స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్న విషయం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయినా సంవత్సరం దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల విజ్ఞప్తితో అద్దెకు స్పీడ్‌బోటు తీసుకుని కొద్దిరోజుల పాటు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం మత్స్యకారుల బాధలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో విసుగు చెందిన మత్స్యకారులు సమస్యను వారే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సోనాబోట్లపై ఎదురుదాడి..గురువారం రాత్రి తమిళ జాలర్లు దాడులు చేయడమే కాకుండా మన ప్రాంత మత్స్యకారులను అవమానించే రీతిలో వ్యవహరించారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు సమీపంలోని కొనపూడి సముద్రతీరంలో సోనాబోట్లతో చేపల వేట సాగిస్తున్న సమాచారం అందింది. వెంటనే రెండు జిల్లాల మత్స్యకారులు అక్కడకు బయలు దేరారు. వారిని అడ్డుకున్నారు. బోటును స్వాధీనం చేసుకుని విజయం సాధించారు. ఆ బోట్లలో మారణాయుధాలతో పాటు, 15 మంది వరకూ తమిళ మత్స్యకారులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గత నెలలో సైతం తమిళజాలర్లను తరిమికొట్టి ఒక సోనాబోటును స్వా«దీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచారు. సుమారు నెల రోజులు దాటినా ఇంత వరకు తమిళనాడు మత్స్యకారులు ఎవరూ ఈ బోటు కోసం వచ్చిన దాఖలాలు లేవని తెలిసింది. తాజాగా మరో బోటును కూడా స్వా«దీనం చేసుకుని దాన్ని కూడా జువ్వలదిన్నెకు తరలించినట్టు సమాచారం. ఇకపై ఎవరు సహకరించినా, సహకరించకపోయినా వెనక్కి తగ్గేదే లేదని ఇకపై తమిళనాడు సోనాబోట్లకు చుక్కలు చూపిస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.
- 
      
                   
                                                       తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదంచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు వ్యక్తులు , ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు. కడలూరు సమీపంలోని చిదంబరం వద్ద ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియ రావాల్సి ఉంది.ఇదీ చదవండి: జడ్జిగారూ.. నా భార్యకు ఎనిమిది మంది భర్తలు
- 
      
                   
                                                       TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్యచెన్నై: తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఆదివారం(జులై 28) అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తిరుపాప్లియూర్కు చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. ఇతడు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. బాగూర్ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా పద్మనాభన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టారు. దీంతో పద్మనాభన్ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పద్మనాభన్‌పై గతంలో హత్యకేసు ఉండటం గమనార్హం.
- 
      
                   
                                 ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం.. ఇద్దరి అరెస్ట్చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత
- 
      
                   
                                 అపస్మారక స్థితిలోకి నాగు.. ఎలా కాపాడాడో చూసేయండిSnake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు. అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్‌తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్‌తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi — Jaya Plus (@jayapluschannel) July 5, 2023 Video Source: Jaya Plus ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్లో ఈ ఘటన జరిగింది. ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు!
- 
      
                   
                                 మరుగు దొడ్డి విషయంలో మనస్తాపం.. ఉరితాడుకు రమ్య!చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రాణంగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, అతని ఇంట పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మచ్చా(బావా) అని ప్రేమగా పిల్చుకునే భర్త దగ్గర బాధను వెల్లగక్కుకుంది. అది అతను అర్థం చేసుకోలేకపోయేసరికి.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసు మారిందేమో అని మళ్లీ ప్రయత్నిస్తే.. అతను అదే సమాధానం ఇవ్వడంతో పెళ్లై నెల కూడా గడవక ముందే ఆ కొత్త పెళ్లికూతురు ఏకంగా ప్రాణమే తీసుకుంది. చెన్నై: తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల రమ్య భర్త తన ఇంట మరుగుదొడ్డి కట్టించడం లేదన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. కడలూరు అరిసిపెరియాన్కుప్పంకు చెందిన రమ్య.. ఎమ్మెస్సీ చదివింది. ఒక ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. రెండేళ్లుగా కార్తికేయన్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పెద్దలను ఒప్పించి కిందటి నెల(ఏప్రిల్ 6న) వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన ఆమెకు అక్కడ మరుగు దొడ్డి లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కడలూరులోనే మరో ఇంటికి మారుదామని అతన్ని కోరింది. కానీ, ఆ కోరిక వివాదానికి దారి తీసింది. అందరిలాగా బహిర్భూమికి వెళ్లమంటూ సలహా ఇచ్చాడు ఆ భర్త. ఈ పరిణామంతో కలత చెందిన రమ్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొన్నిరోజులకు భర్త మనసు మారిందేమో అనే ఉద్దేశంతో.. ఆమె సోమవారం మళ్లీ అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారుదామని మరోమారు బతిమాలింది. కానీ, అతను మాత్రం కరగలేదు. ససేమిరా కుదరదని చెప్పేశాడు. దీంతో ఆవేదన చెందిన రమ్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి కొయ్యకు వేలాడుతున్న రమ్యను.. గుర్తించిన ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. టాయిలెట్ లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కష్టాలు ఎదురైనా.. మనోధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నో. అవి చూసి కూడా జీవితం విలువ గుర్తించరు కొందరు. పైగా చిన్నచిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
- 
  
      తమిళనాడులో పేలుడు.. ఏడుగురు మృత్యువాత
- 
      
                   
                                 విషాదం: ఏడుగురు దుర్మరణంచెన్నై: తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. టపాసుల కర్మాగారంలో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమాని సహా ఏడుగురు మృతి చెందారు. మరో నలుగు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. మృతులంతా మహిళలే. (చదవండి: ఆయిల్ ట్యాంకర్లో అగ్ని ప్రమాదం) ఈ ఘటన గురించి కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ మాట్లాడుతూ.. ‘‘కట్టుమన్నార్‌కోలికి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉంది. మృతులంతా అక్కడ పనిచేసే వాళ్లే. నాటు బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. పరిమితికి మించి పేలుడు పదార్థాలు వాడినందు వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నాం. లోతుగా దర్యాప్తు చేస్తాం’’అని పేర్కొన్నారు. కాగా కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వివిధ ఫ్యాక్టరీల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరిపేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- 
      
                   
                                 ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతిసాక్షి, చెన్నై: తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందగా, ఓ విద్యార్థి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో 9 మంది విద్యార్థులు సముద్రంలో ఈతకు వెళ్లారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా.. భారీ అలల తాకిడికి నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ఒక విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో మిగిలిన నలుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
- 
      
                   
                                 షాకింగ్ : నేను స్నానం చేస్తుంటే గవర్నర్ చూశారు..!సాక్షి, చెన్నై : ‘నేను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్రూమ్లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండి’ అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందం’ని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశాల అనంతరం.. వీధివీధి, ఇల్లిల్లూ తిరుగుతూ పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న మరుగుదొడ్డిలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో క్షణంలో వెనుకడుగువేశారు. అయితే, గవర్నర్ చర్యకు షాక్ తిన్న మహిళ కాసేపటికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్ వెంట కడలూరు కలెక్టర్, అధికార ఏఐడీఎంకేకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్ పర్యటనను నిరసిస్తూ ప్రతిపక్ష డీఎంకే కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. మహిళ ఫిర్యాదుపై గవర్నర్‌గానీ, రాజ్‌భవన్‌గానీ ఇంకా స్పందించాల్సిఉంది. కాన్వాయ్ ఢీకొని ఇద్దరి మృతి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ భద్రతా సిబ్బంది వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందారు. కడలూరు-చెన్నై మార్గంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
- 
      
                   
                                 వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
 బం«ధువుల ఆరోపణ
 కేకేనగర్ : కడలూరు జిల్లాలో ప్రభుత్వ ఆçస్పత్రిలో అబార్షన్ చేయించుకున్న గర్భిణి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిని ముట్టడించి ఆందోళన చేశారు. కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని ఆండిపాళయంకు చెందిన ధనసెలియన్ కూలీ కార్మికుడు.
 
 ఇతని భార్య కళైవాణి(27). వీరికి ఇద్దరు పిల్లలు. ఈ స్థితిలో కలైవాణి మళ్లీ గర్భం దాల్చింది. ఆర్థిక స్తోమత కారణంగా భర్త సూచన మేరకు అబార్షన్‌కు కళైవాణి ఒప్పుకుంది. ఆమెను అబార్షన్ కోసం కడలూరు ప్రభుత్వ ఆçస్పత్రిలో శుక్రవారం చేర్పించారు. వైద్యులు అబార్షన్ చేశారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కళైవాణి అధిక రక్తస్రావం ఏర్పడడంతో మృతి చెందింది. సమాచారం అందుకుని కళైవాణి భర్త, ఆమె బంధువులు కడలూర్ ప్రభుత్వ ఆస్పత్రి ముందు గుమిగూడారు.
 
 ఆమె మృతదేహాన్ని తీసుకోకుండా ఆందోళనకు దిగారు. పుదునగర్ పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. విచారణలో కళైవాణికి శుక్రవారం అబార్షన్ చేశారని, అప్పటి నుంచి ఆమె కళ్లు తెరవకుండా అలాగే ఉందని, ఈ క్రమంలో సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. కళైవాణి మృతిపట్ల తమకు అనుమానం ఉందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందిందని వారు ఆరోపించారు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, నష్ట పరిహారం చెల్లించే వరకు తాము ఆందోళన విరమించేదిలేదని వారు తేల్చిచెప్పారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనాన్ని కలిగించింది.
- 
      
                    తప్పిన గండం
 ► తీరం దాటిన నాడా
 ► బలహీనపడ్డ తుపాన్
 ► కడలూరులో ఆనందం
 ► పలు చోట్ల వర్షాలు
 ► సాగరంలో మరో ద్రోణి
 
 నాడా గండం తప్పింది. బలహీనపడ్డ ఈ తుపాన్ శుక్రవారం కారైక్కాల్ వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నారుు. నాడా తీరం దాటడంతో కడలూరు జిల్లాలోని సముద్ర తీరవాసులు ఆనందంలో మునిగారు. ఈ ఏడాది ఓ గండం నుంచి తాము బయట పడ్డామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇక, సాగరంలో మరో అల్పపీడనం బయలు దేరే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వాతావరణ కేంద్రం ప్రకటించింది. -సాక్షి, చెన్నై
 
 సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బల పడి తుపాన్‌గా మారడం, అది తమిళనాడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న సమాచారం ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. గత ఏడాది వలే ఈ ఏడాది ఎక్కడ మరో గండాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు, కడలూరు వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. నాడా పేరుతో తరుముకొచ్చిన ఈ తుపాన్ హఠాత్తుగా బలహీన పడింది. అరుునా, తీరం దాటే సమయంలో పెను ప్రళయం ఈదురు గాలుల రూపంలో తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరించారు. కడలూరు -నాగపట్నం మధ్యలో తీరం దాటనుండడంతో జాతీయ విపత్తుల నివారణ బృందాలు సైతం రంగంలోకి దిగారుు. నాడా తీరం దాటే వరకు ఉత్కంఠ తప్పలేదు.
 అరుుతే, కడలూరు-నాగపట్నం వైపుగా పయనిస్తూ వచ్చిన నాడా, గురువారం అర్ధరాత్రి సమయంలో మరింతగా బలహీన పడింది. అల్పపీడనంగా మారి తన పయన మార్గాన్ని మార్చుకుంది. దీంతో రాత్రంతా పలుచోట్ల సముద్ర తీరాల్లో మోస్తరుగా వర్షం పడింది. క్రమంగా తీరం సమీపించే కొద్ది నాడా ప్రభావం తగ్గుతూ రావడంతో ఉత్కంఠ వీడింది. కారైక్కాల్‌కు పదిహేను కిమీ దూరంలో ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ఎలాంటి ప్రభావం అన్నది చూపకుండా తీరం దాటింది. తుపాన్ గండం తప్పినట్టు వాతావరణ కేంద్రం ప్రకటనతో కడలూరు తీర వాసుల్లో ఆనందం రెట్టింపు అరుుంది.
 
 కడలూరులో ఆనందం: 
 ఏటా కడలూరు తుపాన్ రూపంలో గండాల్ని చవిచూస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. అటు పుదుచ్చేరిలో ప్రకంపనలు బయలు దేరినా, ఇటు తమిళనాడులో వాన గండాలు నెలకొన్నా, తొలుత విలవిలలాడే ప్రదేశం కడలూరే. కరువుతో తల్లడిల్లినా, గండాలతో ఇక్కడి ప్రజలు కొట్టుమిట్టాడక తప్పదు. ఏటా ఏదో ఒక ముప్పు తమకు తప్పదన్నట్టుగా ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా నాడా సైతం కడలూరు - నాగపట్నం మధ్యలో తీరం దాటనున్న సమాచారం ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక, అధికార వర్గాల్ని పరుగులు తీరుుంచింది. అరుుతే, గండం తప్పిందన్న సమాచారం అక్కడి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసించడం గమనార్హం.
 
 మరో ద్రోణి:
 నాడా తీరం దాటినా, అల్పపీడనంగా మారిన ఆ ప్రభావంతో సముద్ర తీరాల్లో తెరపించి తెరపించి మోస్తరుగా వర్షం పడుతోంది. చెన్నైలో కాసేపు వర్షం, మరి కాసేపు భానుడు ప్రత్యక్షం, ఇంకాసేపటికి ఆకాశం మేఘావృతం అన్నట్టుగా శుక్రవారం వాతావరణం నెలకొంది. గురువారం అర్ధరాత్రి మహాబలిపురంలో 11సెంమీ, చోళవరంలో ఆరు సెంమీ వర్షం అత్యధికంగా నమోదైంది. కాగా, అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనుంది. ఈ ద్రోణి ప్రభావం ఏమిటో, పయన మార్గం ఎలా ఉంటుందోనన్నది ఆదివారం నాటికి తేలనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర వాతావరణ అధికారులు ఢిల్లీలో ప్రకటించారు. ఈ అల్పపీనడం బల పడ్డ పక్షంలో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా కదిలేందుకు ఆస్కారం ఎక్కువే. ఇందుకు కారణం అండమాన్ సమీపంలోని నెలకొనే అల్పపీడనాలు అత్యధికంగా ఎంచుకున్న మార్గాలు ఈ రెండే. ఇక, నాడా ప్రభావం తగ్గినా, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూనే ఉన్నందున, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వర్గాలు సూచిస్తున్నారుు. శనివారం సాయంత్రం తర్వాత వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లొచ్చని సూచించే పనిలో పడ్డారు.
- 
      
                   
                                 చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి
 చెన్నై: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు సేలంలోని ఎంఐటీ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.
 
 మృతదేహాలను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల మరణంతో వారి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
- 
  
      చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి
- 
      
                    తమిళనాడులో భద్రతాదళ కాల్పులు: కార్మికుడి మృతి
 కడలూరు(తమిళనాడు) పిటిఐ: చెన్నై: కడలూరు జిల్లాలో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి) వద్ద భద్రతాదళాలు జరిపిన కాల్పులలో ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
 నైవేలి ఎస్ఐ రామనాథన్ చెప్పిన ప్రకారం సురేష్ అనే కార్మికుడు, అతని సహచరుడు ఈ రోజు మధ్యాహ్నం అనుమతిలేకుండా ఎన్ఎల్సి రెండవ గనిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ రామ్‌సింగ్ అడ్డుకున్నాడు. మొదటి గనిలో పనిచేస్తున్నవారికి రెండవ గనిలోకి ప్రవేశించడానికి అనుమతిలేదు. మద్యం సేవించి ఉన్న వారు కానిస్టేబుల్‌తో గొడవపడి, ఘర్షణకు దిగారు. దాంతో కానిస్టేబుల్ జరిపిన మూడు రౌండ్ల కాల్పులలో సురేష్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసి సురేష్ గ్రామస్తులు సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి జిల్లా ఎస్పి రాధిక పోలీస్ దళాలను రెండవ గని వద్దకు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


