చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి | 8 Students Killed As Car Rams Tree In Tamil Nadu's Cuddalore | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి

Jan 16 2016 6:12 PM | Updated on Aug 30 2018 3:58 PM

చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి - Sakshi

చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి

తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

చెన్నై: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు సేలంలోని ఎంఐటీ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.

మృతదేహాలను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల మరణంతో వారి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement