జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకువచ్చి ఒక్కటయ్యారు!

Two Prisoners Fell In Love Got Married After Parole West Bengal - Sakshi

కోల్‌కతా: వివాహాలు స్వర్గంలో నిర్ణయిస్తారని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇద్దరి ఖైదీల జీవితంలో అలానే జరిగింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారిద్దరూ అనుకోకుండా జైలులో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని ఓ జైలులోని ఇద్దరు ఖైదీల ప్రత్యేక ప్రేమకథ చర్చనీయాంశమైంది. 

వివరాల్లోకి వెళితే.. అస్సాంకి చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమబెంగాల్ కి చెందిన షానారా ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. హసీమ్‌కు 8 ఏళ్లు, షహనారాకు 6 ఏళ్లు శిక్ష విధించి ఇద్దరినీ తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు. అనుకోకుండా జైల్లో ఉండగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ జైలులో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది.

ఖైదీలిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి వారి కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెరోల్‌పై విడుదలైన తర్వాత వాళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తూర్పు బర్ధమాన్‌లోని మోంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెరోల్‌ అనంతరం వీరువురు అదే జైలుకు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది.

చదవండి  ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్‌.. యువతి ఆత్మహత్యాయత్నం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top