
తిరువొత్తియూరు(చెన్నై): దిండిగల్ నత్తం సమీపంలో 5 తరాలను చూసిన 102 ఏళ్ల వృద్ధురాలు తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంది. దిండిగల్ జిల్లా నత్తం సమీపంలోని లింగవాడి గ్రామానికి చెందిన శ్రీనియమ్మాళ్ 1921లో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 102 ఏళ్లు. ఆమె భర్త మీనాక్షిసుందరం సిద్ధ వైద్యుడు.
ఆయన 1997లో మరణించాడు. ఈ దంపతులకు 9 మంది పిల్లలు. వీరిలో ఇద్దరు కుమారులు ఇప్పటికే మృతి చెందారు. ప్రస్తుతం నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 23 మంది మనవళ్లు, మనవరాళ్లు, 27 మంది ముని మనవళ్లు, ముని మనవరాళ్లు, 5వ తరం వారసులుగా నలుగురు మనుమలు, మనుమరాళ్లు మొత్తం 85 మంది ఉన్నారు. శ్రీనియమ్మాళ్ 102వ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.
చదవండి: స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. ఆ పని మాది కాదంటున్న టీచర్లు