
దివ్యాంగులు, మాజీ సైనికులకు కూడా..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) సైతం రిజర్వేషన్లు కల్పించింది. సుప్రీంకోర్టులో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
అలాగే దివ్యాంగులు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన వారికి సైతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇందుకోసం సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్(కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ కాండక్ట్) రూల్స్‌లో సవరణ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేశారు. రిజర్వేషన్లు కల్పించే విషయలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 146 క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఆయన ఉపయోగించుకున్నారు.