సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా సుబ్బరామిరెడ్డి  | Subbaramireddy Appointed As Permanent Invitee Of CWC | Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా సుబ్బరామిరెడ్డి 

Jun 24 2022 3:59 AM | Updated on Jun 24 2022 3:59 AM

Subbaramireddy Appointed As Permanent Invitee Of CWC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయా త్మక కమిటీ సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వాని తునిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ టి.సుబ్బరామి రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.సి.వేణుగోపాల్‌ నుంచి నియామకపు లేఖ అందింది. సుబ్బరామిరెడ్డి గతంలో కేంద్రమంత్రి, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్, టీటీడీ చైర్మన్‌ పదవులు చేపట్టడంతో పాటు పార్టీ పరంగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా, సీడబ్ల్యూసీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రులు కుమారి సెల్జా, అభిషేక్‌ మను సింఘ్విలకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానితునిగా యూపీ మాజీ ఎమ్మెల్యే అజయ్‌ కుమార్‌ లల్లూను నియమించారు. 

Advertisement
 
Advertisement
Advertisement