ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి! | Silkyara Tunnel Accident: Loader Machine Fell In Gorge | Sakshi
Sakshi News home page

Silkyara Tunnel: ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి!

Published Tue, Mar 26 2024 9:58 AM | Last Updated on Tue, Mar 26 2024 10:33 AM

Silkyara Tunnel Accident Loader Machine Fell in - Sakshi

ఉత్తరకాశీలోని యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం బయటనున్న లోడర్ మిషన్ ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి  బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారా సొరంగం వెలుపల పనులలో ఉన్న లోడర్ యంత్రం అకస్మాత్తుగా సొరంగం వెలుపలి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మెషిన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న ఇతర కార్మికులు బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించేలోగానే అతను మృతి చెందాడు. 

మృతుడిని పితోర్‌గఢ్ జిల్లా గోవింద్ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2023, నవంబరులో ఇదే సొరంగంలో జరిగిన ప్రమాదంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత భారీ రెస్క్యూ ఆపరేషన్‌తో వీరిని బయటకు తీసుకువచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement