సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి

SC increases compensation to families of workers who die due to manual scavenging to Rs 30 lakh - Sakshi

ప్రభుత్వ యంత్రాంగానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది.

మాన్యువల్‌ స్కావెంజింగ్‌ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్‌ భట్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top