బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త | Saved his daughter-in-law who fell into a well | Sakshi
Sakshi News home page

బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త

Apr 5 2025 9:05 AM | Updated on Apr 5 2025 9:05 AM

Saved his daughter-in-law who fell into a well

 ఇద్దరు సురక్షితం 

అన్నానగర్‌:  విల్లుపురం జిల్లా మేల్‌ మలయనూర్‌ సమీపంలోని పాలంబుండి గ్రామానికి చెందిన అయ్యప్పన్‌. ఇతని భార్య సరసు (22). ఆవులకు గడ్డి కోసేందుకు బుధవారం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సరసు ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న 60 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది.

ఆమెకు ఈత రాక కేకలు వేసింది. కేకలు విన్న  అత్త మల్లిక (45) సరసును రక్షించేందుకు బావిలోకి దూకింది. ఈమెకు ఈత రాకపోవడంతో వారిద్దరూ బావిలో రాయిని పట్టుకుని కేకలు పెట్టారు. కేకలు విని చుట్టుపక్కల వారుఅగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మేల్‌ మలయనూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలోకి దిగి మల్లిక, సరసులను సురక్షితంగా బయటకు తీసి  ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement