గణేశ్‌ లడ్డూల తయారీలో జడేజా భార్య | Rivaba Jadeja Made Laddus in Ganesh Pandal | Sakshi
Sakshi News home page

గణేశ్‌ లడ్డూల తయారీలో జడేజా భార్య

Sep 15 2024 8:58 AM | Updated on Sep 15 2024 11:10 AM

Rivaba Jadeja Made Laddus in Ganesh Pandal

జామ్‌నగర్: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలలో భక్తుల రద్దీ నెలకొంది. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా తన నియోజకవర్గం జామ్‌నగర్ నార్త్‌లోని గణేశుని మండపంలో లడ్డూలు తయారు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రివాబా జడేజా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా గణేష్ మహోత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నాం. మా గణేశుడికి 4,000 లడ్డూలు నైవేద్యంగా పెడుతున్నాం. లడ్డూలను 50 మందికి పైగా మహిళలు తయారు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
 

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2024 టీ 20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. రవీంద్ర జడేజా కూడా తన భార్యలాగే రాజకీయాల వైపు దృష్టి సారిస్తూ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. రవీంద్ర గతంలో తన భార్య రివాబా కోసం  ఎన్నికల ప్రచారం చేశారు. పలు రోడ్ షోలలో కూడా కనిపించారు. ఆయన భార్య రివాబా ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. 2022లో ఆమె జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఇది ​​కూడా చదవండి: ఒకే ఈతలో 13 కుక్కపిల్లలు 

 

Advertisement
 
Advertisement
Advertisement