మీ అనురాగమే నన్ను ముందుకు నడిపిస్తోంది | President Murmu Distributes Chocolates to Children on Her Birthday | Sakshi
Sakshi News home page

మీ అనురాగమే నన్ను ముందుకు నడిపిస్తోంది

Jun 21 2026 4:28 AM | Updated on Jun 21 2026 4:28 AM

President Murmu Distributes Chocolates to Children on Her Birthday

ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కృతజ్ఞతలు 

న్యూఢిల్లీ: తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆప్యాయత, అనురాగాలే  తనను ముందుకు నడిపిస్తున్నాయని, దేశ సేవను కొనసాగించడానికి స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు. దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ముర్ము 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో జన్మించారు.

 శనివారం 68వ పడిలోకి ప్రవేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఆప్యాయ తతో పంపించిన సందేశాలు, శుభాకాంక్షలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తదితరులకు ముర్ము ధన్యవాదాలు తెలిపారు. 

ముర్ము ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ  
రాష్ట్రపతి ముర్ము ధైర్యం, సరళత, వినమ్రత, ప్రజాసేవ పట్ల అచంచలమైన అంకితభావంతో కూడిన ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ముర్ము దేశానికి విశేషమైన సేవలందించారని, ముఖ్యంగా అట్టడుగు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement