పర్లాకిమిడిలో బేటీ బచావ్‌.. బేటీ పడావ్‌ | - | Sakshi
Sakshi News home page

పర్లాకిమిడిలో బేటీ బచావ్‌.. బేటీ పడావ్‌

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

పర్లాకిమిడి: బేటీ బచావ్‌.. బేటీ పడావ్‌ జిల్లా స్థాయి కర్మశాలను అదనపు జిల్లా మేజిష్ట్రేటు ఫల్గునీ మఝి గురువారం కలెక్టరేట్‌ హాల్‌లో ప్రారంభించారు. ఆయనతో పాటు సబ్‌కలెక్టర్‌ అనుప్‌ పండా, శిశు సంక్షేమం ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ సరళా పాత్రో, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, డీఎస్పీ సరితా బెవురియా తదితరులు పాల్గొన్నారు. ఈ కర్మశాలలో సోషల్‌ వర్కర్లకు మొబైల్‌ ద్వారా జరుగుతున్న సైబర్‌ మోసాలను ఎలా అరికట్టవచ్చో డీఎస్పీ సరితా బెవురియా తెలియజేశారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో మన ప్రోఫైల్‌ లాకింగ్‌, పాస్‌ వర్డు జతచేయడం, ఫిషింగ్‌, స్పామ్‌ కాల్స్‌ను నిర్బంధించడానికి చరవాణుల్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చుకోవాలని డీఎస్పీ సరితా బెవురియా తెలియజేశారు. అలాగే యువతుల ఉన్నత విద్యకు బ్యాంకులు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుందని సరితా పాత్రో తెలియజేశారు. మానవ అక్రమరవాణా, పడతులపై అత్యాచారాలు, మోసాలపై వుమెన్స్‌ హెల్ప్‌లైన్‌ 181, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, సైబర్‌ క్రైం మోసాలకు 1930 లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని చైల్డ్‌ ప్రోటెక్షన్‌ ఆఫీసర్‌ సరితా పాత్రో సూచించారు. అనంతరం వివిధ పాఠశాలల బాలికలు బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ ఉద్దేశ్యంపై డ్యాన్సు రూపంలో నృత్యం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement