భువనేశ్వర్: భువనేశ్వర్‌లో జరుగుతున్న బ్రిక్స్ విద్యా సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన చైనా, ఇరాన్ ప్రతినిధి బృందాల సభ్యులు గురు వారం ఒడిశా రాష్ట్ర సంగ్రహాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర సంగ్రహాలయం డైరెక్టర్ డాక్టర్ భారతి పాల్ వారికి సాదరంగా స్వాగతం పలికి ఒడిశా ఘన చరిత్ర, వారసత్వం, వాస్తు శిల్పం, సాహిత్యం, కళలు, సంస్కృతి గురించి చైనా, ఇరాన్ ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. ప్రతినిధులు ఇక్కడ సంగ్రహించి భద్ర పరిచిన పురాతఽన వస్తువులు, తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, నాణాలు, ఆయుధాలు, కుండలు, హస్త కళలు, అనుభవ్ హెరిటేజ్ గ్యాలరీ మొదలైనవాటిని సందర్శించారు. వారు ఒడిశా పురావస్తు శాస్త్రాన్ని, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన వారసత్వాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర మ్యూజియం తరపున టైమ్‌లెస్ టేల్ (ఒడిశా రాష్ట్ర మ్యూజియం గురించిన పుస్తకం) అనే పుస్తకాన్ని చైనా, ఇరాన్ ప్రతినిధులకు డైరెక్టర్ డాక్టర్ భారతి పాల్ బహుకరించారు.


