ఏసీ లేని వార్డులో డెలివరీ.. కయ్యానికి దిగిన వియ్యంకులు 

Pregnant Woman Family Thrashes In Laws Over AC Room - Sakshi

లక్నో: యూపీలోని బారాబంకిలో నెలలు నిండిన తమ బిడ్డ డెలివరీకి ఏసీ వార్డులో చేర్పించలేదని కోపంతో ఓ గర్భవతి తల్లిదండ్రులు ఆమె అత్తమామలను చితక బాదారు. ఈ వీడియోని అక్కడున్నవారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 

తమ బిడ్డకు నెలలు నిండడంతో డెలివరీ నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుసుకుని బిడ్డను చూసేందుకు ఆత్రుతతో హాస్పిటల్ కు వెళ్లారు గర్భవతి తల్లిదండ్రులు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏసీ వార్డులో కాకుండా నాన్ ఏసీ వార్డులో ఉన్న తమ బిడ్డను చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

మొదట మాటల యుద్ధానికి తెరతీసిన వారు మెల్లగా ముష్టియుద్ధానికి తెగబడ్డారు. వియ్యంకుడు రామ్ కుమార్ తోపాటు అతని భార్యని ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకొట్టేశారు. వారు కూడా తిరగబడటంతో గొడవ మరీ పెద్దదైంది. రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఈ వీరంగమంతా జరగడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో ఎక్కడెక్కడో చక్కెర్లు కొడుతోంది.    

ఇది కూడా చదవండి: కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top