
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గల జేజే ఆస్పత్రి నుంచి బంగ్లాదేశ్ గర్భిణి ఖైదీ తప్పించుకుంది. గురువారం మధ్యాహ్నం ఆమె పారిపోగా, అప్పటి నుంచి ముంబై పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. నకిలీ జనన ధృవీకరణ పత్రం ఉపయోగించి భారతీయ పాస్‌పోర్ట్ పొందినందుకు రుబీనా ఇర్షాద్ షేక్(27)ను ఆగస్టు 7న వాషి పోలీసులు అరెస్టు చేశారు.
ఆమెపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పాస్‌పోర్ట్ చట్టం, విదేశీయుల చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ నేపధ్యంలోనే ఆమెను అరెస్ చేసి, బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. జ్వరం, జలుబు, చర్మ సంబంధిత వ్యాధుల ఫిర్యాదుల మేరకు ఐదు నెలల గర్భిణి అయిన రుబీనాను ఆగస్టు 11న జెజె ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 14న మధ్యాహ్నం ఆమె ఒక కానిస్టేబుల్‌ను తోసి, పారిపోయింది. ఖైదీ రుబీనా ఇర్షాద్ షేక్ ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.