అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ | PM Narendra Modi Letter To Parliament Floor Leaders Of All Parties | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ

Apr 12 2026 10:30 AM | Updated on Apr 12 2026 10:50 AM

PM Narendra Modi Letter To Parliament Floor Leaders Of All Parties

ఢిల్లీ: అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నారీ శక్తి వందన్ అదినియమ్‌ ద్వారా మహిళా శక్తిని మరింత బలోపేతం చేయాలన్న ప్రధాని.. వీలైనంత తొందరగా మహిళా రిజర్వేషన్  అమలు చేయాలన్న అంశంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.

ఈ బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేశాం. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. మహిళలకు రిజర్వేషన్ వల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతం. పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలి’’ అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement