జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన దృశ్యం.. వీడియో వైరల్‌ | Tornado-Like Phenomenon Hits Akhnoor | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన దృశ్యం.. వీడియో వైరల్‌

Apr 12 2026 8:11 AM | Updated on Apr 12 2026 10:45 AM

Tornado-Like Phenomenon Hits Akhnoor

అఖ్నూర్‌: జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో అరుదైన టోర్నడో 10 నిమిషాల పాటు భీభత్సం సృష్టించింది.  క​శ్మీర్ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ టోర్నడో జనావాసాలకు దూరంగా ఉండటంతో దీంతో ఎటువంటి నష్టం  కలుగలేదు. వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించిన టోర్నడ్‌ను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నడో సంభవించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. టోర్నడో వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

టోర్నడో మూడు గంటల తర్వాత వాతావరణ శాఖ విశ్లేషించింది. నార్‌వెస్టర్  తుపానుల వల్ల ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితులే ఈ టోర్నడో-లాంటి ఫార్మేషన్‌కు కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మళ్ళీ టోర్నడోలు వచ్చే అవకాశం లేదని డాప్లర్ వాతావరణ రాడార్  డేటా తెలిపింది. ప్రస్తుతం 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా టోర్నడో ఆనవాళ్లు లేవని పేర్కొంది.

టోర్నడో అత్యంత శక్తివంతమైన గాలి తుఫాను. భారీ గాలి సుడిగాలి. ఇది తీవ్రంగా తిరిగే గాలి స్తంభం రూపంలో ఉంటుంది. అమెరికాలో ఇటీవల టెక్సాస్, ఒక్లహామా, మిస్సోరి, కాన్సాస్, కెంటకీ రాష్ట్రాల్లో టోర్నడోలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement