మోదీ-రాహుల్‌ మధ్య ఆసక్తికర సంభాషణ | PM Modi, Rahul Gandhi engage in candid talks: Video Viral | Sakshi
Sakshi News home page

మోదీ-రాహుల్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

Apr 11 2026 11:09 AM | Updated on Apr 11 2026 11:31 AM

PM Modi, Rahul Gandhi engage in candid talks: Video Viral

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో ఈ ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరిగాయి. పార్లమెంట్‌ ఆవరణలో ప్రేరణ్‌ స్థల్‌ వద్ద ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ నివాళులర్పించి ప్రసంగించారు. అంతకు ముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాక ప్రధాని మోదీ అక్కడే వేచి ఉన్న రాహుల్ గాంధీకి, ఇతరులకు నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.

మోదీ మాట్లాడుతుండగా.. రాహుల్ గాంధీ తల ఊపుతూ, వేళ్లు కదిలిస్తూ సమాధానం ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే కుతూహలం నెలకొంది. అయితే రాహుల్‌ను ప్రధాని మోదీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

అనంతరం మోదీ మాట్లాడుతూ..  జ్యోతిరావ్ పూలే సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుడు. ఆయన ఆలోచనలు నేటికీ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ ప్రేరణ. ఆయన చూపిన మార్గం నేటి భారతదేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.

రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. నివాళి వేదికపై ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement