breaking news
mahatma jyotiba phule jayanti
-
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. చదవండి: AP Cabinet 2022 Live Updates: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం -
విద్యతోనే మహిళా సాధికారత
ఏలూరు, న్యూస్‌లైన్ : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జ్యోతీరావుపూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాది నుంచి బాలికల విద్యపై వివక్షత వల్లే సమాజంలో ఆశించిన ఫలితాలు సాధ్యపడడం లేదన్నారు. అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత సమాజంలో కూడా పదో తరగతి తర్వాత బలవంతంగా చదువుమానిపించి బాలికలకు వివాహాలు జరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు చదువు మానడం వల్ల సమాజానికి ఎంతో నష్టమన్నారు. ముఖ్యంగా బాలికలకు పెళ్లి చేయడం వల్ల ఆమె ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతందన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, అదే పూలేకు నిజమైన నివాళి అన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు పూలే నిరంతరం పోరాటం చేసి సామాజిక విప్లవానికి బాటలు వే శారన్నారు. రజక సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పూలే జీవితం అందరికీ ఆదర్శమని స్త్రీ చదువుకుంటేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్త పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తెంటు సూర్యనారాయణ, సుదర్శన్, కన్నబాబు, మణిసింగ్, సామాజిక కార్యకర్త ఆర్ఎస్ఆర్, ఏఎస్‌డబ్ల్యూవో కె.భాను సాధన పాల్గొన్నారు.