ఏపీ ప్రజలది అసాధారణమైన ప్రతిభ: ప్రధాని మోదీ | PM Modi Wishes Andhra Pradesh People On State Formation Day | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు

Nov 1 2023 10:01 AM | Updated on Nov 1 2023 10:41 AM

PM Modi Wishes Andhra Pradesh People On State Formation Day - Sakshi

ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారంటూ ప్రధాని మోదీ.. 

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారాయన. 

ఏపీ ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్‌ చేశారాయన. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవం.. వైఎస్సార్‌ అవార్డుల ప్రదానం నేడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement