శ్రావ్యమైన కీర్తనతో నవరాత్రులకు ప్రధాని మోదీ స్వాగతం | PM Modi Posts Soulful Bhajan as Navratri Begins | Sakshi
Sakshi News home page

శ్రావ్యమైన కీర్తనతో నవరాత్రులకు ప్రధాని మోదీ స్వాగతం

Sep 22 2025 11:06 AM | Updated on Sep 22 2025 11:20 AM

PM Modi Posts Soulful Bhajan as Navratri Begins

న్యూఢిల్లీ: ‍ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సోమవారం) నుంచి ప్రారంభమైన శారదా నవరాత్రులను ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ పాడిన భక్తి భజన కీర్తనతో స్వాగతించారు. ఈ సందర్బంగా ప్రధాని తన సందేశంలో.. పండుగ వాతావరణంలో సంగీతం అందించే ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరితో పాటు పంచుకోవాలని.  దేశ ప్రజలు తమకు ఇష్టమైన భజనలతో పునీతులు కావాలన్నారు. నవరాత్రి అంటే స్వచ్ఛమైన భక్తి అని, చాలా మంది ఇటువంటి భక్తిని సంగీతం ద్వారా సంగ్రహించారన్నారు. పండిట్ జస్రాజ్ శృతి చేసిన అలాంటి ఒక ఆత్మీయమైన పాటను మీతో పంచుకుంటున్నాను అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు.
 

భజన కీర్తనల ఆలాపనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, ఆయన ‍ప్రజల నుంచి వారి సొంత భజన పాటలను తనకు పంపాలని లేదా వారికి ఇష్టమైన వాటిని తనతో షేర్‌ చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో వాటిని అందరికీ షేర్‌ చేస్తానని ప్రధాని తెలిపారు. నవరాత్రుల తొలి రోజున దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. భక్తి, ధైర్యం, దృఢ సంకల్పంతో నిండిన ఈ పవిత్ర  ఉత్సవం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త బలాన్ని కొత్త విశ్వాసాన్ని  పెంపొందించాలి.. జై మాతా ది!" అని ప్రధాని మోదీ రాశారు.

మరో పోస్ట్‌లో ఆయన తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున పూజలందుకునే మా శైలపుత్రిని  ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ‘ఈ రోజు నవరాత్రులలో శైలపుత్రి పూజలకు  ప్రత్యేకమైన రోజు. అమ్మవారి ఆప్యాయత,  ఆశీర్వాదాలతో, ప్రతి ఒక్కరి జీవితం మంచి ఆరోగ్యంతో నిండాలని అభిలషిస్తున్నానని’ ఆయన అన్నారు.  సెప్టెంబర్ 22 నుంచి దేశం అంతటా శారదీయ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. భక్తులు ఆలయాల్లో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement