కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు | People Get So Fed With Judicial Process CJI | Sakshi
Sakshi News home page

కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు

Aug 3 2024 4:35 PM | Updated on Aug 3 2024 4:43 PM

People Get So Fed With Judicial Process CJI

న్యూఢిల్లీ: న్యాయప్రక్రియపై చీఫ్‌జస్టిస్‌ఆఫ్‌ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. శనివారం(ఆగస్టు3) సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్‌అదాలత్‌ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. 

కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్‌లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు. కేసుల సెటిల్‌మెంట్‌లో లోక్‌అదాలత్‌లది కీలక పాత్ర అని చెప్పారు. లోక్‌అదాలత్‌లో సెటిల్‌ చేసుకున్న కేసుల్లో అప్పీల్‌ ఉండదని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement