‘వాళ్లంతా పరాన్నజీవులు..’ | Cyber Criminals Are Parasites: Supreme Court | Sakshi
Sakshi News home page

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

Jun 17 2026 5:58 PM | Updated on Jun 17 2026 6:39 PM

Cyber Criminals Are Parasites: Supreme Court

ఢిల్లీ: సైబర్‌ మోసాలపై  కఠినంగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. సైబర్‌ నేరగాళ్లు అమాయక ఇన్వెస్టర్లను మోసగించి.. కోట్లు దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులుగా అభివర్ణించింది. వాళ్లు పరాన్నజీవులు.. కఠినమైన చట్టం తెవాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

సైబర్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఇవాళ (బుధవారం)  సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. వారు అమాయక పౌరుల నుండి భారీ మొత్తంలో డబ్బును మోసం చేస్తున్నారు. అలాంటి నిందితులను జైల్లో ఉంచడం వల్లే సమాజానికి మేలు జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పుపై సీజేఐ వ్యాఖ్యానిస్తూ.. ‘‘మీరంతా పరాన్నజీవులు. ప్రజల నుండి డబ్బు తీసుకుని వారిని ముంచుతున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల మనం కఠినంగా ఉండాలి. మిమ్మల్ని జైల్లో ఉంచడమే సమాజ హితం. గుజరాత్‌లో ఒకరి దగ్గర, ముంబైలో మరొకరి దగ్గర.. ఇలా డబ్బులు వసూలు చేస్తారు. గత ఏడాది చివరి నాటికి భారతీయులు డిజిటల్ మోసాల వల్ల రూ.3వేల కోట్లకు పైగా నష్టపోయారని.. దీన్నిబట్టి దేశంలో సైబర్‌ నేరాల తీవ్రత ఏంటో తెలుస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement