సరస్సులో పడిపోయిన పారాగ్లైడర్‌.. వీడియో వైరల్‌ | Paraglider Falls Into Uttarakhands Tehri Lake | Sakshi
Sakshi News home page

సరస్సులో పడిపోయిన పారాగ్లైడర్‌.. వీడియో వైరల్‌

Oct 11 2024 8:45 AM | Updated on Oct 11 2024 9:15 AM

Paraglider Falls Into Uttarakhands Tehri Lake

డెహ్రాడూన్‌:పారాగ్లైడింగ్‌ శిక్షణ తీసుకుంటున్న ఓ వ్యక్తి  ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్‌ శిక్షణ కార్యక్రమంలో రిషి అనే వ్యక్తి అదుపుతప్పి తెహ్రీ సరస్సులో పడిపోయాడు.

వెంటనే స్పందించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు రిషిని రక్షించారు. పారాగ్లైడింగ్‌ చేస్తూ రిషి సరస్సులో పడిపోవడం, అతడిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోటులో వచ్చి కాపాడడం చకచకా జరిగిపోయాయి. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. 

 ఇదీ చదవండి: విమానంలో మహిళకు వేధిం‍పులు.. వ్యక్తి అరెస్ట్‌ 

Advertisement
 
Advertisement
Advertisement