విమానంలో మహిళకు వేధింపులు..వ్యక్తి అరెస్ట్‌ | Man Arrested For Harrasing Woman In Indigo Flight | Sakshi
Sakshi News home page

విమానంలో మహిళకు వేధింపులు..వ్యక్తి అరెస్ట్‌

Oct 11 2024 7:19 AM | Updated on Oct 11 2024 8:41 AM

Man Arrested For Harrasing Woman In Indigo Flight

చెన్నై:ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని ఓ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాజేష్‌శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) చట్టం కింద శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితునిది రాజస్థాన్‌ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి: జాక్‌పాట్‌ కొట్టిన మెకానిక్‌..లాటరీలో రూ.25 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement