లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం.. వీడియో వైరల్‌ | Panic Inside Lift As Aggressive Pet Dog Lunges At Young Girls In Mumbai | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం.. వీడియో వైరల్‌

Jul 18 2026 5:48 PM | Updated on Jul 18 2026 6:05 PM

Panic Inside Lift As Aggressive Pet Dog Lunges At Young Girls In Mumbai

ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం సృష్టించింది. ముగ్గురు మహిళలపై దాడికి యత్నించింది.  ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని 'శేత్ ఐరీన్' టవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

లిఫ్ట్‌లో అప్పటికే ముగ్గురు యువతులు ఉండగా.. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లోపలికి ప్రవేశించింది. లిఫ్ట్ తలుపులు మూసుకున్న కొద్దిసేపటికే.. ఆ కుక్క మూతికి మాస్క్‌ ఉన్నప్పటికీ.. ఒకస్కారిగా దూసుకెళ్తూ.. వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కుక్క ఒక్కసారిగా దాడికి దిగడంతో యజమాని కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆ కుక్క యువతులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే యువతులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, మరో యువతి మాత్రం లోపలే చిక్కుకుపోయింది. ఆమెపైకి కుక్క మరింత అగ్రెసివ్‌గా దూసుకెళ్లింది.

చివరకు లిఫ్ట్ నిర్దేశిత ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ యువతి కూడా వేగంగా బయటకు వచ్చి తప్పించుకుంది. ఈ ఘటనపై మలాడ్ పోలీసులు స్పందిస్తూ.. ఈ  ఘటనలో బాలికలకు ఎలాంటి గాయాలు కాలేదని.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. సదరు నివాసికి తన పెంపుడు జంతువును లిఫ్ట్‌లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఈ సీసీటీవీ వీడియో బయటకు రావడంతో అపార్ట్‌మెంట్ వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement