రక్షణశాఖ డేటాను పాక్ హ్యాక్ చేసిందా? | Pak hackers claim to have breached multiple Indian defence sites | Sakshi
Sakshi News home page

రక్షణశాఖ డేటాను పాక్ హ్యాక్ చేసిందా?

Published Mon, May 5 2025 7:29 PM | Last Updated on Mon, May 5 2025 7:48 PM

 Pak hackers claim to have breached multiple Indian defence sites

న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి భారత్ ను టార్గెట్ చేస్తూ హ్యాకింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న తరుణంలో పాక్ హ్యాకర్లు ఒక ప్రకటన చేశారు. తాము భారత రక్షణశాఖ సైట్లను లక్ష్యంగా చేసుకుని డేటాను హ్యాక్ చేసినట్లు స్పష్టం చేశారు.

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటాను అపహరించినట్లు పాకిస్తాన్ సైబర్స్ ఫోర్స్ అనే హ్యాండిల్ పోస్ట్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్‌వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా పాకిస్తాన్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. , ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు. అయితే తమ వెబ్ సైట్ లో డేటాను పాక్ హ్యాక్ చేసినట్లు వార్తలను నోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఖండించింది. అందులో వాస్తవం లేదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement