ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు | Opposition MPs Protest In Delhi Against CEC Gyanesh Kumar Resignation | Sakshi
Sakshi News home page

ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు

Oct 9 2026 8:24 PM | Updated on Oct 9 2026 8:35 PM

Opposition MPs Protest In Delhi Against CEC Gyanesh Kumar Resignation

ఢిల్లీ:  చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో విపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డుల ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్‌  నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకూ నిరసన ప్రదర్శన కొనసాగింది. ఆపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిర్యాదు చేశారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం అందజేశారు. సర్  పేరుతో 13 కోట్ల  ఓట్లు  తొలగించారని  ఫిర్యాదు చేశారు.

అంతకుముందు ఢిల్లీలో విపక్ష ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి బయల్దేరి వెళ్లారు. 

దీనిలో భాగంగా ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టాలన్నీ అక్రమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో భారీగా ఓట్ల చోరీ జరిగిందని, అలాగే హర్యానా, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందని ధ్వజమెత్తారు. దీనికి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఢిల్లీలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత
ఢిల్లీలో తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. సెంట్రల్‌ ఢిల్లీలో 4 కి.మీ పరిధిలో ఇంటర్నెట్‌ బంద్‌ చేశారు. జనపథ్‌, కర్తవ్యపథ్‌ పరిసరాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేశారు. రేపు(శనివారం, అక్టోబర్‌ 10వ తేదీ) జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ నిరసనకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ముందుగానే ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. 

ఇదీ చదవండి: సెంట్రల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement