కర్ణాటక బ్యాంక్ చేసిన ఒక తప్పు ఎంట్రీ దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలను అప్రమత్తం చేసింది.బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలో అతిపెద్ద తప్పుపై బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్‌బీఐ (RBI) ఇపుడు దృష్టి సారించింది. అంతర్గతంగా, కర్ణాటక బ్యాంక్ నాయకత్వ బృందం దాని ప్రక్రియలను బలోపేతం చేయడంలో బిజీగా ఉంది, ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారులు నియంత్రణలు. రిస్క్ మేనేజ్‌మెంట్ వైఫల్యంపై బ్యాంకును ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కొనసాగుతున్న వార్షిక పర్యవేక్షణలో రెగ్యులేటర్ దృష్టిని ఆకర్షించిన ప్రధాన సమస్యలలో ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ కూడా ఒకటి అని ఈ పరిణామం గురించి తెలిసిన ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయని మనీ కంట్రోల్ తన కథనంలో పేర్కొంది. 2023 ఆగస్టు 9న దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన ఆ ఘటన వివరాలేంటో తెలుసా?
మనీ కంట్రోల్ కథనం ప్రకారం కర్ణాటక బ్యాంక్ ఖాతానుంచి ఒక తప్పిదం( A fat finger error) సాయంత్రం 5:17లకు లక్ష కోట్ల రూపాయలు ఒక అకౌంట్‌కు బదిలీ అయ్యాయి! ఉద్యోగి పొరపాటున ఈ నగదును యాక్టివ్‌గాలేని పొదుపు ఖాతాలోకి నమోదు చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా రాత్రి 8 గంటలకు దాదాపు 3 గంటల్లోపు ఆ సొమ్ము తిరిగి క్రెడిట్ అయింది. దీనిపై బ్యాంకు ఉన్నత యాజమాన్యం దిగ్భ్రాంతి చెందింది. కానీ ఈ సంఘటన గురించి ఉన్నతాధికారులకు లేదా బోర్డుకు వెంటనే తెలియజేయలేదు. ఈ విషయాన్ని ఆరు నెలలు దాచిపెట్టారని ఆరోపణ. దీన్ని తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించి RBI దర్యాప్తు ప్రారంభించింది.
అయితే ఈ వ్యవహారం గురించి బ్యాంక్ రిస్క్ మేనేజ్‌మెంట్ బృందానికి తెలియజేసినట్టు, కానీ అది బోర్డుకు చేరడానికి ఆరు నెలలు పట్టిందని సంబంధిత పత్రాల ద్వారా తెలుస్తోంది. ( లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో)
డబ్బు యాక్టివ్ ఖాతాకు బదిలీ చేయలేదు, సిస్టమ్ ఎంట్రీ, కాబట్టి సరిపోయింది. లేదంటే లక్ష కోట్ల రూపాయలంటే మాటలా. ఇది కర్ణాటక బ్యాంక్ మొత్తం అడ్వాన్సుల కంటే చాలా రెట్లు ఎక్కువ. 2024మార్చిలో అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్‌మెంట్ల జారీ ద్వారా బ్యాంక్ దాదాపు రూ. 600 కోట్ల మూలధనాన్ని సేకరించింది. FY25లో బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు రూ.76,541 కోట్లు. తప్పుగా నమోదు చేసిన సొమ్ము రూ. 100,000 కోట్లు. దీని అర్థం ఒక చిన్న మిస్టేక్ బ్యాంకు పరిమాణం కంటే పెద్దది.
(రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)
ఈ సంఘటన పరిణామ క్రమం ఇలా
మార్చి 4, 2024 : మొదటిసారి రిస్క్ కమిటీకి సమాచారం అందించారు.
మార్చి 11, 2024: రిస్క్ కమిటీ వివరణాత్మక నివేదికను కోరింది.
మార్చి 15, 2024: ఐటీ విభాగం ఒక నోట్‌ను సమర్పించింది.
మార్చి 28, 2024: దీనిపై బోర్డుకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
అక్టోబర్ 23, 2024: బోర్డు సమావేశంలో ఈ సమస్యను మళ్ళీ లేవనెత్తినట్టు తెలుస్తోంది.
ఇపుడు ఈ రెండు విషయాలపైనా ఇపుడు ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది ఇంత పెద్ద వ్యవస్థ వైఫల్యాన్ని ఆరు నెలలుగా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? అనేది ఆరా తీస్తోంది. ఈ సంఘటనను తన వార్షిక పర్యవేక్షణ ,పర్యవేక్షణలో కీలకమైన సమస్యగా పరిగణిస్తోంది.
మరోవైపు ఇటీవల బ్యాంకు సీఎండీ శ్రీకృష్ణన్ హెచ్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ రావు ఈ సంవత్సరం జూలైలో తమ పదవుల నుండి వైదొలిగారు. ఎండీ రాజీనామా తర్వాత, ముఖ్యంగా 2023 తరువాత బ్యాంకులో చేరిన సీనియర్ లీడర్ షిప్ ఎగ్జిక్యూటివ్‌లు బ్యాంకును వీడారు. అయితే ఒక వేళ ఆ ఖాతా నిద్రాణంగా ఉండకపోతే, మనీ క్రెడిట్ కాగానే వాళ్లు స్పందించి ఉంటే? ఆ సొమ్ము దుర్వినియోగానికి ప్రయత్నించి ఉంటే? ఇది కేవలం అక్షర దోషమా లేదా సిస్టమ్ నియంత్రణలలో బలహీనతా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలు, రిపోర్టింగ్ గురించి తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
కర్ణాటక బ్యాంక్ అధికారిక స్పందన
దీనిపై స్పందించిన బ్యాంకు ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించుకున్నామని, ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దీన్ని ఆర్‌బీఐకి నివేదించినట్టు కూడా తెలిపింది. దీనిపై RBI ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.


