సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నిలకకు సంబంధించిన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పది రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి.


