వీడియో: డే కేర్‌ సెంటర్‌ నిర్వాకం.. పిల్లల విషయంలో జాగ్రత్త! | Noida day care center Video Viral In Social Media | Sakshi
Sakshi News home page

వీడియో: డే కేర్‌ సెంటర్‌ నిర్వాకం.. పిల్లల విషయంలో జాగ్రత్త!

Aug 11 2025 11:35 AM | Updated on Aug 11 2025 12:01 PM

Noida day care center Video Viral In Social Media

నోయిడా: చిన్నారులను వారి పేరెంట్స్‌ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన పని లేదు. కానీ.. ప్రస్తుత జనరేషన్‌లో ఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా.. వారి పిల్లలను చూసుకునేందుకు కొందరు పేరెంట్స్‌కి సమయం ఉండటం లేదు. ఈ కారణంగా చిన్నారులను డే కేర్‌ సెంటర్లలో వదిలేసి వెళ్తున్నారు. ఇక, కొన్ని డే కేర్‌ సెంటర్లలో చిన్నారుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంటోంది. తాజాగా నోయిడాలోని ఓ డే కేర్‌ సెంటర్‌లో 15 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డే కేర్‌ అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఇద్ద‌రు పేరెంట్స్ ఉద్యోగ‌స్తులు కావ‌డంతో.. త‌మ 15 నెల‌ల ప‌సిబిడ్డ‌ను స్థానికంగా ఉన్న ఓ డేకేర్ సెంట‌ర్‌లో జాయిన్ చేశారు. అయితే ఆగ‌స్టు 4వ తేదీన ఆ ఆడ‌శిశువు ఎందుకో గుక్క‌ప‌ట్టి ఏడ్చింది. దీంతో డే కేర్‌లో యువతి.. ఏడుస్తున్న పాప‌ను లాలించాల్సింది పోయి.. క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించింది. ఏడుస్తున్న ఆ ప‌సిబిడ్డ‌ను ఎత్తుకుని ప‌లుమార్లు నేల‌కేసి కొట్టింది. అయినా ఏడుపు మాన‌డం లేద‌ని త‌ల‌ను గోడ‌కేసి కొట్టింది. చెంప దెబ్బ‌ల‌తో తీవ్రంగా గాయ‌ప‌రిచింది. అంతటితో ఆగకుండా.. బ్యాట్‌తో కొట్ట‌డంతో తొడ‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

అదే రోజున సాయంత్రం కావడంతో డే కేర్‌ సెంటర్‌కు వచ్చిన పేరెంట్స్‌.. తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ ప‌సిపాప శ‌రీరంపై ఉన్న గాయాల‌ను చూసి షాక్ అయ్యారు. తొడపై కొరికనట్టు గాయం, పలుచోట్ల ఎర్రగా కమిలిపోయి ఉండటంతో ఆవేదనకు గురైన పేరెంట్స్‌.. బిడ్డను తీసుకుని స్థానిక ఆసుపత్రిలో డాక్టర్‌ను సంప్ర‌దించారు. ఈ గాయాల‌న్నీ ఎవ‌రో కొట్టిన‌వి అని.. సదరు డాక్ట‌ర్ నిర్ధారించడంతో ఖంగుతిన్నారు.

దీంతో డే కేర్ సెంట‌ర్‌లోని సీసీటీవీ ఫుటేజీని బాధిత చిన్నారి పేరెంట్స్ ప‌రిశీలించారు. చంటిబిడ్డ‌ను ప‌నిమ‌నిషి హింసించిన భ‌యాన‌క దృశ్యాల‌ను చూసి త‌ల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో డే కేర్ సెంట‌ర్ హెడ్‌తో పాటు ప‌ని మ‌నిషిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారిద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు డే కేర్‌ సెంటర్‌ నిర్వాకంపై మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement