జార్ఖండ్‌లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఖరారు | NDA announces seat-sharing arrangements in Jharkhand Assembly elections | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఖరారు

Oct 19 2024 5:16 AM | Updated on Oct 19 2024 5:16 AM

NDA announces seat-sharing arrangements in Jharkhand Assembly elections

బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ 2, ఎల్‌జేపీ(ఆర్‌)కు ఒక స్థానం

సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ మధ్య సీట్ల పంపకాలు ఖరార య్యాయి.  బీజేపీ 68, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) 10, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) 2, లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) 1 స్థానంలో పోటీ చేయాలని శుక్రవారం నిర్ణయించాయి. 

ఏజేఎస్‌యూ– సిల్లి, రామ్‌గఢ్, గోమియా, ఇచాగర్, మాండు, జుగ్సాలియా, డుమ్రి, పాకూర్, లోహర్దగా, మనోహర్‌పూర్, జేడీయూ– జంషెడ్‌పూర్‌ వెస్ట్, తమర్‌ స్థానాల నుంచి, ఎల్‌జేపీ (ఆర్‌) ఛత్రా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20ల్లో రెండు దళల్లో పోలింగ్‌ జరగనుంది. 23న ఫలితాలు ప్రకటించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement