దక్షిణ, మధ్య ప్రాంతాల్లోకి ఇటీవల రుతుపవనాలు విస్తరించినప్పటికీ, దేశంలోని చాలా ప్రాంతాలలో అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదు. మురిపించినట్టే మురిపించిన మేఘాలు తగినతంగానే వర్షించకుండానేమాయమైపోతున్నాయి. ఇదే విషయాన్ని ఉపగ్రహ చిత్రాలుకూడా వెల్లడిస్తున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాలు ఎందుకు దోబూచులాడుతున్నాయనే ఆందోళన నెలకొంది.
ఐఎండి (IMD) గణాంకాల ప్రకారం, జూన్ 4 నుండి జూన్ 15 మధ్య సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి బదులుగా కేవలం 19.2 మి.మీ. మాత్రమే నమోదైంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షపాతంలో 64 శాతం లోటు ఏర్పడింది. అంటే భారతదేశ నైరుతి రుతుపవనాలు దాదాపుగా అదృశ్యమైనట్లు కనిపిస్తోంది. శాటిలైట్ అండ్ ఐఎండి (IMD) డేటా ప్రకారం, భారతదేశంలోని చాలా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. ఈ వారం చివర్లో వర్షపాతం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, ఎగువ వాతావరణంలోని గాలుల కారణంగా రుతుపవనాల కార్యకలాపాలు గణనీయంగా నిలిచిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ 14 , 15 తేదీలలో తీసిన INSAT-3DS ఉపగ్రహ చిత్రాలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. నైరుతి రుతుపవనాలు కరుణించకపోవడంతో అటు రైతులు, ఇటు సామాన్యులు ఆకాశం వైపు చూస్తూన్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, వర్షం ఎందుకు కురవడం లేదు? అనే మీమాంసలో పడిపోయారు.
భారీ వర్షపాత లోటు
జూన్ 4 నుండి జూన్ 15 మధ్య కాలంలో సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి గానూ దేశంలో కేవలం 19.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏకంగా 64శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఐఎండీ (IMD) మ్యాప్ ప్రకారం మధ్య, దక్షిణ , తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందంటున్నారు.
ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!
సాధారణంగా రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నప్పుడు దేశమంతటా దట్టమైన మేఘాలు వ్యాపించి ఉంటాయి. కానీ జూన్ 15 నాటి INSAT-3DS ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ద్వీపకల్ప (పెనిన్సులర్), మధ్య భారతదేశ ఆకాశం అసాధారణంగా నిర్మలంగా కనిపిస్తోంది. మేఘాల కదలికలు కేవలం హిమాలయాలు, ఈశాన్య భారత్, ఇండో-గంగా మైదానాల ఉత్తర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అరేబియా సముద్రం వైపు రుతుపవన శాఖ బలహీనపడింది. ఇటీవలి రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగినప్పటికీ ఈ మందగమనం చోటుచేసుకుంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సమస్య చుట్టుపక్కల సముద్రాలపై తేమ కొరత వల్ల కాదు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల పైన జరుగుతున్న ఒక పెద్ద వాతావరణ సంఘర్షణ వల్ల ఏర్పడింది.
ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!
రుతుపవనాలు మందగమనానికి కారణాలు
సముద్రాలలో తగినంత తేమ ఉన్నప్పటికీ, వాతావరణంలో ఎగువ పొరల్లో జరుగుతున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రుతుపవనాల సమయంలో ఇది ఉత్తరానికి వెళ్లాల్సి ఉండగా, ఈసారి అసాధారణంగా దక్షిణం వైపునకు మరలిపోతున్నాయి. ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ పై ప్రభావమే కారణమా? ఈ బలమైన పశ్చిమ గాలులు (Westerlies), రుతుపవనాలకు ఇంజిన్‌లా పనిచేసే తూర్పు గాలుల (Easterlies) మెకానిజంను అణచివేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమ ఉన్నప్పటికీ, మేఘాలు ఏర్పడటానికి మరియు వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు లభించడం లేదు. అయితే వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఈ వారం చివర్లో జెట్ స్ట్రీమ్ సరళి బలహీనపడి, రుతుపవన వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అప్పటి వరకు, నైరుతి రుతుపవనాలిచ్చే విస్తృత వర్షాల కోసం భారతదేశంలోని చాలా ప్రాంతాలు వేచి ఉండవలసిందే.
ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?


