రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? | Is Monalisa In Danger? Maha Kumbh Viral Girl Herself Revealed the Truth, See More Details Inside | Sakshi
Sakshi News home page

రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా?

Published Wed, Feb 19 2025 7:16 AM | Last Updated on Wed, Feb 19 2025 9:05 AM

Monalisa in Danger Maha kumbh Viral Girl Herself Revealed the Truth

యూపీలోని జరుగుతున్న కుంభమేళా నేపధ్యంలో చాలామంది వైరల్‌గా మారారు. అయితే వీరందరిలో ప్రయాగ్‌రాజ్‌కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలినా భోంస్లే ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికిరాత్రే సోషల్‌ మీడియా క్వీన్‌గా మారిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నీలికళ్ల సుందరి రిస్క్‌లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది.

కుంభమేళా మోనాలిసాను చూసిన డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్‌ ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ పేరుతో  కుంభమేళా మోనాలిసా హీరోయిన్‌గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీనిని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు, చదువుకున్నదంటూ పలు వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్‌ ప్రమోషన్‌లో కూడా పాల్గొంది.

తాజాగా ప్రొడ్యూసర్‌ జితేంద్ర నారాయణ్‌ కుంభమేళా గర్ల్‌ మోనాలిసా రిస్క్‌లో పడిందంటూ వ్యాఖ్యానించారు. ఆమె దర్శకుడు సనోజ్‌ మిశ్రా ట్రాప్‌లో పడిందంటూ ఆరోపించారు. సనోజ్‌ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని, అయితే లైమ్‌ లైట్‌లో ఉండేందుకే ఆయన మోనాలిసాను తన వెంట తీసుకువెళుతున్నారని ఆరోపించారు. అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మోనాలిసా షేర్‌ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్‌ మిశ్రాపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది. తానేమీ అతని ట్రాప్‌లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశలో ఉన్నానని, యాక్టింగ్‌ నేర్చుకుంటున్నానని, తన సోదరి, తన పెదనాన్న తనతోనే ఉన్నారని, తానేమీ ఎవరి వలలోనూ పడలేదని పేర్కొంది. సనోజ్‌ మిశ్రా తనను కుమార్తెలా చూసుకుంటున్నారని, ఆయన చాలా మంచి మనిషి అని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది. 

ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్‌’ ఖర్చెంత? లాభమెంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement