నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం: మోదీ | Modi Govt fulfills long pending demands of the Hukumchand mill workers | Sakshi
Sakshi News home page

నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం: మోదీ

Dec 26 2023 4:33 AM | Updated on Dec 26 2023 4:33 AM

Modi Govt fulfills long pending demands of the Hukumchand mill workers - Sakshi

సోమవారం ఢిల్లీలో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఇండోర్‌: సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో హుకుంచంద్‌ మిల్లు కార్మికులకు రూ.224 కోట్ల మేర బకాయిలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించారు.

బకాయిల చెల్లింపుతో 4,800 మంది కారి్మకులకు లబ్ధి చేకూరనుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని హర్షం వ్యక్తం చేశారు. బిల్లు కారి్మకులకు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తున్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కరిపించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.   

మాలవీయ పుస్తకం ఆవిష్కరణ   
బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్‌ మోహన్‌ మాలవీయ రచనలు, లేఖలు, కరపత్రాలు, ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. మాలవీయ రచనలను ఆంగ్లం, హిందీ భాషల్లో 11 సంపుటాలుగా ప్రచురించారు.   

క్రిస్మస్‌ శుభాకాంక్షలు  
సమాజానికి సరైన దశ దిశను చూపడంలో, ప్రజలకు సేవలందించడంలో క్రైస్తవుల పాత్ర పట్ల దేశం గరి్వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఆయన క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో క్రైస్తవులతో సమావేశమయ్యారు. క్రైస్తవ వర్గం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేదలకు సేవలందించడంలో క్రైస్తవులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. యేసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు.

వాజ్‌పేయికి ముర్ము, మోదీ నివాళులు  
దివంగత ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం ‘సదైవ్‌ అటల్‌’ వద్ద సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి కోసం వాజ్‌పేయి అహరి్నశలూ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్, కిరణ్‌ రిజిజు, హర్దీపుసింగ్‌ పురి, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement