జైల్లో ఉన్న బాయ్‌ఫ్రెండ్‌ కోసం.. వందడుగుల టవరెక్కిన యువతి | 17 Year Old Girl Climbs Mobile Tower In Jharkhand, Demands Release And Marriage With Jailed Lover, More Details Inside | Sakshi
Sakshi News home page

జైల్లో ఉన్న బాయ్‌ఫ్రెండ్‌ కోసం.. వందడుగుల టవరెక్కిన యువతి

Jun 24 2026 9:23 AM | Updated on Jun 24 2026 11:18 AM

Minor girl climbs 100-foot mobile tower in Jharkhand

బొకారో: జైలులో ఉన్న తన ప్రేమికుడిని వెంటనే విడుదల చేసి, తనతో పెళ్లి జరిపించాలని డిమాండ్‌ చేస్తూ 17 ఏళ్ల యువతి సెల్‌ టవరెక్కి ఐదు గంటలపాటు హంగామా సృష్టించింది. జార్ఖండ్‌ రాష్ట్రం బొకారో జిల్లా గోమియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధెంధే గ్రామంలో మంగళవారం ఘటన చోటుచేసుకుంది.ఈ నెల 18వ తేదీన తన కుమార్తెను రాంచీకి చెందిన యువకుడు నిర్బంధించాడంటూ ఓ మహిళ ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు దర్యాప్తు చేసి, ఆ యువతిని తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. నిర్బంధించిన వ్యక్తిని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చి, రిమాండ్‌లో ఉంచారు. అదే యువతి తిరిగి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామంలోని సెల్‌ టవర్‌పైకెక్కింది. జైల్లో ఉన్న అతడితో తనకు పెళ్లి జరిపించాలంటూ డిమాండ్‌ చేసింది. గ్రామస్తులు, పోలీసులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఎట్టకేలకు కిందికి దిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement