ఢిల్లీలో స్వల్ప భూకంపం  | Minor Earthquake Of 2.3 Magnitude Struck South East Delhi, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో స్వల్ప భూకంపం 

Jun 9 2025 6:39 AM | Updated on Jun 9 2025 9:28 AM

Minor earthquake of 2. 3 magnitude struck South East Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం అర్థరాత్రి దాటాక స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి. 

ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్‌లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్‌. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్‌కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్‌–డెహ్రాడూన్‌ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్‌లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement