breaking news
minor earthquake
-
ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం అర్థరాత్రి దాటాక స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్‌కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది. -
ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు
-
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూకంపం
అద్దంకి/శావల్యాపురం: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో రాత్రి భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. సంతమాగులూరు మండలంలో కుందుర్రు, మాక్కెనేనివారిపాలెం, ఏల్చూరు, సజ్జాపురం, మామిళ్లపళ్లి, పరిటావారిపాలెం, అడవి పాలెం, కొప్పరం గ్రామాల్లోనూ, బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం, సరేపల్లి, వైదన, చవిటిమాదగపల్లె, కొమ్మినేనివారిపాలెం గ్రామాల్లో సుమారు పది సెకన్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. అలాగే గుంటూరు జిల్లా వినుకొండ పరిధిలో, శావల్యాపురం మండల పరిధిలోని మతుకుమల్లి గ్రామంలో రాత్రి 7.35 గంటలకు భూమి కంపించిందని.. సుమారు 6 సెకన్లపాటు జరిగిన ఈ ఘటనతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారని గ్రామస్తులు చెప్పా రు. ఇంట్లో వంట పాత్రలు కదులుతుంటే భయకంపితులయ్యామని తెలిపారు.