గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూకంపం | minor earthquake reported in guntur, prakasham districts | Sakshi
Sakshi News home page

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూకంపం

Oct 31 2014 12:16 AM | Updated on Aug 24 2018 2:33 PM

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది.

అద్దంకి/శావల్యాపురం: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో రాత్రి భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. సంతమాగులూరు మండలంలో కుందుర్రు, మాక్కెనేనివారిపాలెం, ఏల్చూరు, సజ్జాపురం, మామిళ్లపళ్లి, పరిటావారిపాలెం, అడవి పాలెం, కొప్పరం గ్రామాల్లోనూ, బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం, సరేపల్లి, వైదన, చవిటిమాదగపల్లె, కొమ్మినేనివారిపాలెం గ్రామాల్లో సుమారు పది సెకన్ల పాటు భూమి కంపించిందని చెప్పారు.

అలాగే గుంటూరు జిల్లా వినుకొండ పరిధిలో, శావల్యాపురం మండల పరిధిలోని మతుకుమల్లి గ్రామంలో రాత్రి 7.35 గంటలకు భూమి కంపించిందని.. సుమారు 6 సెకన్లపాటు జరిగిన ఈ ఘటనతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారని గ్రామస్తులు చెప్పా రు. ఇంట్లో వంట పాత్రలు కదులుతుంటే భయకంపితులయ్యామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement