Men Thrash Father With Sticks In Front Of Crying Son - Sakshi
Sakshi News home page

దారుణం: చిన్నారి ఏడుస్తున్నా.. తండ్రిపై కర్రలతో.. వీడియో వైరల్..

Aug 11 2023 7:53 PM | Updated on Aug 11 2023 8:38 PM

Men Thrash Father With Sticks In Front Of Crying Son  - Sakshi

చంఢీగర్‌: పంజాబ్‌లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వక్తిపై కొందరు యువకులు కర్రలతో దాడి చేశారు. బాధితుని చేతిలో చిన్న కుమారుడు ఉన్నాడనే విచక్షణ కూడా లేకుండా కర్రలతో చితకబాదారు. పక్కనే ఉన్న కుర్రాడు ఏడుస్తున్నా కనికరం లేకుండా బాధితునిపై దాడి చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సాలో జరిగింది. 

ఉదయం సమయంలో బాధితుడు తన పిల్లాడ్ని స్కూల్‌ వద్ద దింపడానికి బైక్‌పై వచ్చాడు. పాఠశాల వద్ద అలా ఆపాడో లేదో.. అప్పటికే వెంబడించిన కొంతమంది యువకులు అతనిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడు తిరుగుబాటు చేయకుండా ఓ వ్యక్తి.. అతన్ని బిగ్గరగా పట్టుకున్నాడు. మిగిలిన వ్యక్తులు దాడి చేశారు. పక్కనే ఉన్న బాధితుని కుమారుడు ఏడుస్తున్నా.. నిందితులు పాశవికంగా కొట్టారు. 

నిందితులు దాడి చేస్తున్నా పక్కనే ఉన్న అందరూ చూస్తున్నారు తప్పా.. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. నిందితులు వెళ్లిపోయాక ఓ మహిళ.. బాధితున్ని లేపి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  

ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement