ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు | Massive Fire Break Out Footwear Factory in Delhi Narela | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు

Nov 1 2022 12:50 PM | Updated on Nov 1 2022 1:02 PM

Massive Fire Break Out Footwear Factory in Delhi Narela - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని చెప్పుల పరిశ్రమలో మంగళవారం ఉదయం ఉన్నట్టుండి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుంది. పది ఫైర్‌ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా..  ముగ్గురిని రక్షించారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement