ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ | Massive encounter in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

Nov 17 2024 6:17 AM | Updated on Nov 17 2024 6:17 AM

Massive encounter in Chhattisgarh

ఐదుగురు మావోయిస్టులు మృతి 

ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు 

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ – నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కాంకేర్‌ – నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దుల్లోని నార్త్‌ అబూజ్‌మడ్‌లో గల పేకమెటాకపూర్‌ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ విభాగాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే కూంబింగ్‌ చేపట్టారు.

ఈ క్రమంలో శనివారం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరపగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మరి కొందరు తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటనలో చిర్మాన్‌ యాదవ్, కైలేశ్వర్‌ గావ్డే అనే జవాన్లు తీవ్రంగా గాయపడడంతో నారాయణపూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, మందులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement