అమిత్‌ షా ఇంటి వద్ద మణిపూర్‌ మహిళలు నిరసన

Manipur Kuki Women Protested Outside Amit Shahs Residence - Sakshi

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నివాసం వెలుపల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోంమంత్రి అమిత్‌ షా నివాసం వద్ద మణిపూర్‌లోని కుకి తెగకు చెందని మహిళలు నిరసన చేపట్టారు. గతకొద్దిరోజులుగా మణిపూర్‌ హింసాత్మక అల్లరులతో అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ మహిళలు కేంద్రహోంమంత్రి ఇంటి వద్ద ఇలా తమ నిరసనను తెలిపారు. శాంతి పునురుద్ధరిస్తామని అమిత్‌ షా హామీ ఇచ్చినప్పటికీ మణిపూర్‌లో మా సంఘంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆ మహిళలు చెబుతున్నారు.

అక్కడ మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. మాకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా , ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే మాకు సహాయం చేయలగలరని ఆ మహిళలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మణిపూర్‌లో భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు సైన్యం తెలిపింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ జరిగిన ఆపరేషన్‌లో చాలా మంది తిరుగుబాటుదారులు మరణించారు.

అంతేగాదు జూన్‌ 05 నుంచి 6 వరకు రాత్రి భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయని భారత సైన్యం ట్విట్టర్‌లో పేర్కొంది. నిజానికి అక్కడ గిరిజన సముహాలు మెజారిటీ మెయిటీ కమ్యూనిటీతో ఆర్థిక ప్రయోజనాలు, తెగలకు ఇచ్చిన కోటాల విషయంలో ఘర్షణ పడటంతో మొదలైంది ఈ జాతి హింస.

గిరిజన సంఘాలు తమ ప్రయోజనాలను మెయిటీలకు పొడిగించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా, మణిపూర్‌లో శాంతి, శ్రేయస్సుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని భద్రతా బలగాలకు హోంమంత్రి సూచించారు.

(చదవండి: 25 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు శుభవార్త)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top