25 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు శుభవార్త

rajasthan government employees full benefit pension - Sakshi

రాజస్థాన్‌ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు పూర్తి పెన్షన్‌ అందించనున్నట్లు వెల్లడించింది. జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌  అధ్యక్షత జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్యాబినెట్‌ సమావేశంలో  రాజస్థాన్‌ సివిల్‌ సర్వీస్‌ (పెన్షన్‌) నిబంధన 1996 సవరణ ప్రతిపాదనకు అనుమతి లభించింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు రిటైర్మెంట్‌ అనంతరం పూర్తి పెన్షన్‌ అందుకోనున్నారు. అయితే విధమైన లబ్ధి పొందాలంటే ప్రభుత్వ ఉద్యోగి 28 ఏళ్ల సర్వీసు పూర్తి చేయడం తప్పనిసరి.  దీనితో పాటు 75 ఏళ్ల పింఛనుదారుడు లేదా అతని ఫ్యామిలీ 10 శాతం అదనపు పెన్షన్‌ భత్యం అందుకుంటారు.

ప్రభుత్వం తీసుకున్న  ఈ నూతన నిర్ణయం ప్రకారం పింఛనుదారు మరణించిన తరువాత రూ. 12,500 వరకూ ప్రతీనెలా ఆదాయం అందుకునే అతని వివాహిత కుమారుడు లేదా కుమార్తె కూడా ఫ్యామిలీ పెన్షన్‌ అందుకునేందుకు అర్హులవుతారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ కొత్త సవరణ నోటిఫికేషన్ 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. 

చదవండి: చిత్రాలు గీసేందుకు చేతులెందుకు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top