కెప్టెన్‌ అన్షుమన్‌ భార్యపై అసభ్యకర కామెంట్లు.. పాక్‌ వ్యక్తి పనే! | Low Rated Comment On Captain Anshuaman Wife From Pakistan Netizen, Creates Controversy | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ అన్షుమన్‌ భార్యపై పాక్‌ నెటిజన్‌ అసభ్యకర కామెంట్లు

Jul 14 2024 4:44 PM | Updated on Jul 14 2024 6:36 PM

Low Rated Comment On Captain Anshuaman Wife From Pakistan Netizen

న్యూఢిల్లీ: కీర్తిచక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్‌ అన్షుమన్‌సింగ్‌ సతీమణిపై సోషల్‌మీడియాలో పలువురు చేస్తున్న వివాదాస్పద కామెంట్లపై దుమారం రేగుతోంది. అసభ్యకర కామెంట్లు చేసిన వారిలో ఒకరిపై మహిళా కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఇ‍ప్పటికే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. 

అయితే అసభ్యకర కామెంట్‌ చేసిన వ్యక్తి భారతీయుడు కాదని, పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తని తెలుస్తోంది.‘అది చాలా దిగజారిన కామెంట్‌. సోషల్‌ మీడియాలో  ఆ కామెంట్‌ చూడగానే సుమోటోగా తీసుకున్నాం. పోలీసులు దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే కామెంట్‌ పెట్టిన వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది’అని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ చెప్పారు.

కాగా, గతేడాది సియాచిన్‌లో ఆర్మీలో విధులు నిర్వహిస్తుండగా జరిగిన అగ్నిప్రమాదంలో కెప్టెన్‌ అన్షుమన్‌ ప్రాణాలు కోల్పోయారు. అయితే తాను చనిపోయే ముందు ఈ ప్రమాదం నుంచి తన సహచరులను ప్రమాదం నుంచి అన్షుమన్‌ కాపాడారు. 

ఇందుకుగాను భారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఇటీవల జులై5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్‌ భార్య స్మృతిసింగ్‌,మాతృమూర్తులకు అందించారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement