పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట | love couple approached the police | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Oct 2 2026 9:28 AM | Updated on Oct 2 2026 9:30 AM

love couple approached the police

తమిళనాడు: వేలూరు జిల్లా వరదలాంబట్టు గ్రామానికి చెందిన మోహన్‌బాబు ఇతను గత నాలుగు సంవత్సరాలుగా హోసూరులో ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి హోసూరు సిప్‌కాడు ప్రాంతానికి చెందిన బానుమతిలకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భానుమతి కుటుంబ సభ్యులు ఖండించినట్లు  తెలుస్తోంది. అయినప్పటకీ ఇద్దరూ రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వేలూరు సమీపంలోని కోడివూరు గ్రామంలోని మునీశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. 

బుధవారం సాయంత్రం వేపంకుప్పం పోలీసులను ఆశ్రయించి తమ వివాహానికి పెద్దల నుంచి హాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను రప్పించి చర్చలు జరిపారు. ఆ సమయంలో యువతి తల్లి కుమార్తె కాలుపై పడి కన్నీరు పెట్టి తనతో పాటు రావాలని వేడుకుంది. అయినప్పటికీ ప్రియుడితో వెలుతానని యువతి తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు ఇరువైపు బంధువులతో చర్చించి సర్దిచెప్పి పంపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement