శాంతి భద్రతల అంశం.. నాకు సంబంధం లేదు: సీజేఐ | Law and order not my domain says CJI Surya Kant on Delhi protest | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతల అంశం.. నాకు సంబంధం లేదు: సీజేఐ

Oct 13 2026 6:15 AM | Updated on Oct 13 2026 6:15 AM

Law and order not my domain says CJI Surya Kant on Delhi protest

న్యూఢిల్లీ: ‘‘ఇది శాంతి భద్రతల అంశం. నాకు సంబంధించినది కాదు’’. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసనల పరిస్థితిపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం చేసిన వ్యాఖ్య ఇది. అదే సమయంలో సామాన్యుడైనా, ప్రజా ప్రతినిధి అయినా.. అందరి కోసం సుప్రీంకోర్టు తలుపులు ప్రతి ఒక్కరికి తెరిచే ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేశారు. 

జాతీయ మానవహక్కుల కమిషన్‌ 33వ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాల్గొన్న సీజేఐ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... పై వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఎందుకు తిరస్కరించిందీ వివరించారు. ప్రతిపక్ష నేతలు రాసిన లేఖ తనకు అందిందని, ప్రత్యుత్తరంగా రాసిన లేఖలో తిరస్కరణకు కొన్ని కారణాలు వివరించానని సమావేశమయ్యేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశానని వివరించారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఎందరో ఎంపీలు తమ సమస్యలు వ్యక్తం చేయాలని అనుకుంటున్నారని విలేకరులు గుర్తు చేయగా.. ‘‘సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉన్నాయి’’అని తెలిపారు. 

సామాన్య వక్తి అయినా ఏదైన సంస్థకు ఎన్నికైన వారైనా సరే.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయవచ్చునని విచారణ జరిపి చట్టానికి అనుగుణంగా ప్రజలకు అవసరమైన హక్కులు వారికి దక్కేలా చూస్తామని వివరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీ సులు, భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం, 45 మెట్రో స్టేషన్లను మూసివేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ నేతలతోపాటు పలువురు మాజీ ముఖ్యమంత్రులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ అంశాన్ని సీజేఐ దృష్టికి తీసుకురాగా.. ‘‘అది శాంతి భద్రతల అంశం. నాకు సంబంధించింది కాదు’’అని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement